మన జీవితంలో మనం సాధించిన, సాధించే, సాధించబోయే విజయాలు అన్నీ కూడా మనపై మనకు ఉన్న ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసంల పైనే ఆధారపడి ఉంటుంది.
బాధాకరమయిన విషయం ఏమిటంటే, ఒక పేద లేక మధ్యతరగతి వ్యక్తికి తన పెంపకం లోనూ, చుట్టు పక్కల సమాజంలోనూ, జరిగే అనుభవాల లోనూ, వ్యక్తులలోనూ కూడా ఎంత సేపూ తనకున్న ఆ ఆత్మ గౌరవాన్ని భంగపరిచేటట్లుగానే ఉంటాయి తప్ప, దానికి ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉండదు.
దానితో వారు జీవితమంతా కూడా, మధ్య తరగతి మనస్తత్వం తోనూ, భయాలతోనూ జీవిస్తుంటారు. ఒక వేళ ఆర్ధికంగా ఎదగడానికి అవకాశాలు వచ్చినా కూడా రకరకాల భయాలతో, అనుమానాలతో ఆ అవకాశాలను కాలతన్నుకుని మళ్ళీ ఆర్ధిక స్థితికి బాధలు పడుతుంటారు.
ఆ మానసిక స్థితిని పోగొట్టి మళ్ళీ మనలో మన ఆత్మ గౌరవాన్ని పెంచేదే ఈ అద్భుతమైన కోర్సు. ప్రతి మధ్య, పేద, ధనిక తరగతుల వారూ చేయవలసిన కోర్సు. ప్రస్తుతం మీరు ఏ తరగతి లో ఉన్నా కూడా, మీరు పై తరగతికి చేరడం తధ్యం.
సింపుల్ గా చెప్పాలంటే, ఈ కోర్సు మొదటి వారం లోనే మీతో మీరు గ్యారంటీగా ప్రేమలో పడతారు. ప్రపంచంలో అందరి కన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు. నేను ఎవరికన్నా ఎందులోనూ తక్కువ కాదు అనే నమ్మకంతో అద్భుత విజయాలు సాధిస్తారు. ఇది తధ్యం.
ఈ కోర్సు మనలో నిద్రాణంగా ఉన్న మన ఆత్మ గౌరవాన్ని మేలుకొలిపి మనపై మనకు నమ్మకాన్ని కలిగించి తద్వారా మనం మన జీవితంలో కోరుకున్న ఆర్ధిక,కెరీర్, ప్రేమ,గుర్తింపు మొదలయిన లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఒకే ఒక ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఇది ఒక సారి మొదలు పెట్టిన తరువాత, 21 రోజుల వరకూ ఆపకుండా చేయండి. మధ్యలో ఎప్పుడయినా ఆగిపోతే, మళ్ళీ మొదటి రోజు నుంచి చేయాలి.
మీ జీవితంపై, మిమ్మల్ని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవితాలపై మీకు ఏమాత్రం బాధ్యత ప్రేమ ఉన్నా, దయ చేసి ఒక్క 21 రోజులు రోజుకు ఒక్క 5 నిమిషాలు మీపై మీరు పని చేయండి.
అది కూడా చేయలేని వారు జీవితంలో అభివృధ్ధి గురించి మాట్లాడటమే కాదు కలలు కనే హక్కు కూడా లేని స్థితికి చేరుకుంటారు ఇకపై నిర్ణయం మీదే.