ప్రెషర్ కుకర్ సిండ్రోం అనేది మనలో ప్రతి ఒక్కరిలో తెలియకుండానే ఏర్పడుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే స్పందించి, తీవ్రత తగ్గగానే మళ్ళీ రిలాక్స్ అయిపోయి తీవ్రత పెరిగే పరిస్థితులు సృష్టించుకుంటాము.ఉదాహరణకి, అప్పులవాళ్ళు వచ్చి మనం వాళ్ళకి తీరుస్తామని ఇచ్చిన గడువు తేదీ వచ్చిందని గుర్తు చేసి అప్పు తీర్చమని అడిగేదాకా ఆ విషయాన్ని పట్టించుకోకుండా, అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం పరిగెడుతూ ఉండటం చాలా మందికి సహజం. అలా కాకుండా సమస్య తీవ్రతరం కాకుండానే దానికి చేయవలసిన నివారణ చర్యలు తీసుకోవడం ఎలానో ఈ కోర్సు తెలుపుతుంది.